ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ గారు, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని చెప్పారు.
విద్యార్థులు తమ అమ్మ పేరుతో మొక్కలు నాటాలని, కాలుష్య రహిత వాతావరణాన్ని తయారు చేసుకోవడానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణలో వివిధ పర్యావరణ అంశాలపై పోస్టర్లతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేశారు.
అంతేకాక, ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జిల్లా సైన్స్ అధికారి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






