భీమ్గల్, 28 July
మగపపఉపఠశమగళ'జశఅయ–జగ(3.0)'యమగగ'యచై'అగహయమజగ.పమఖయ,జయధపైయథఅగహపచ.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సీడీఎంఏ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'జల శక్తి అభియాన్–జన్ భాగీదారి (3.0)' కార్యక్రమంలో భాగంగా 'క్యాచ్ ది రైన్' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నీటి సంరక్షణ, వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు ప్రజలు సహకరించాలని సూచించారు. నీరు ప్రాణాధారమని, దానిని వృథా చేయకుండా సంరక్షించడం ద్వారా భావితరాలకు సురక్షిత భవిష్యత్తు అందించవచ్చని పేర్కొన్నారు.
అలాగే ఇంటి చెత్తను తడి–పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకుని డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు, ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.











