Bhimgal, 2026-06-05
పర్యావరణ పరిరక్షణ, ఆలయాల పరిశుభ్రత లక్ష్యంగా భీంగల్ యోగా బృందం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నందీశ్వర ఆలయంలో పారిశుధ్య పనులు నిర్వహించడంతో పాటు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఆలయాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమ్గల్ యోగా బృందం నందీశ్వర ఆలయంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా యోగా సభ్యులు మాట్లాడుతూ, పచ్చదనం పరిరక్షణే ధ్యేయంగా 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. మొక్కల పెంపకంతో పాటు ఆలయ ప్రాంగణాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.












