Bhimgal, 1 August
భీంగల్మండలప్రజాపరిషత్కార్యాలయంలోఇందిరాక్రాంతిపథకం,ఉపాధిహామీపథకంసిబ్బందితోగంగుల'జలసిరి'కార్యక్రమంపైసమీక్షనిర్వహించారు.ప్రతిఇంటిముందుఇంకుడుగుంతనిర్మించుకునేలాసంఘాలుకృషిచేయాలనిఆయనసూచించారు.
ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మించుకునేలా మహిళా సంఘాలు కృషి చేయాలని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సూచించారు.
భీంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఇందిరా క్రాంతి పథకం, ఉపాధి హామీ పథకం సిబ్బందితో 'జలసిరి' కార్యక్రమంపై ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలసిరి కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. మొదటి విడతలో మహిళా సంఘాల ద్వారా 50 ఇళ్లకు, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మరో 50 ఇంకుడు గుంతలు.. మొత్తం 100 ఇంకుడు గుంతలను ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, ప్రతి గ్రామంలో రైతుల పొలాల్లో ఫారం పాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని, కమ్యూనిటీ స్థలాలైన ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, మినీ వాటర్ ట్యాంకుల దగ్గర కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించాలని కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో ఏపీఎం ప్రమీల, ఏపీఓ నరసయ్య, ఈసీ చందు, సీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.









