కారేపల్లి (భారత్ స్పెక్ట్రమ్) జూలై 28
భీమ్గల్మండలంలోనికారేపల్లింలోమంగళవారంసీతలపండుగనుభక్తిశ్రద్ధలతోఘనంగానిర్వహించారు.ంలోపాడిపంటలు,గొడ్డు,గేదెలుగాఉండాలని,మంచిుకురిసిపంటలుబాగాపండాలనిఆకాంక్షిస్తూసాతియాడిభవానిఅమ్మవారికి,నైవేద్యాలుసమర్పించారు.
భీమ్గల్ మండలంలోని కారేపల్లి గ్రామంలో మంగళవారం సీతల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గొడ్డు, గేదెలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ సాతి యాడి భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు.
గ్రామ ప్రజలు సంప్రదాయ వస్త్రధారణలో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం, పాడి పంటల అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ నాయక్ బాబులాల్ నాయక్, కార్బరి రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతీలాల్ నాయక్, ఉప సర్పంచ్ సుజాత రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాజీ కౌన్సిలర్ లింగం నాయక్, మాజీ ఎంపీపీ తుక్కాజీ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ అంగోత్, రమేష్, మాజీ ఉప సర్పంచ్ అంబాజీ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్, వైస్ చైర్మన్ ప్రేమ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్ద హర్యా నాయక్, రాంజీ, నంద్యా, రాజు, బంతిలాల్, పరశురామ్, సోమ్లా, మల్లేష్, వెంకటేష్, గంగాధర్, వెంకట్రాం తదితరులు, గ్రామ సంఘాలు, వాడకట్టు పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










