నిజామాబాద్, 14 September
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
అర్ధరాత్రి నగరంలో సీపీ ఆకస్మిక తనిఖీలు! గణేష్ మండపాల వద్ద భద్రతపై ప్రత్యేక నిఘా.. ప్రమాద బాధితులకు సీపీ సాయం నిజామాబాద్: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పూలాంగ్, ఆర్ఆర్ చౌరస్తా, ఖిల్లా చౌరస్తా, బోధన్ బస్టాండ్, శ్రద్ధానంద్ గంజ్, దుబ్బ, అరుంధతినగర్, సుభాష్‌నగర్, చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్, విద్యుత్‌నగర్, గూపన్పల్లి, ముబారక్‌నగర్ తదితర ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద బందోబస్తు, పోలీస్ సిబ్బంది విధులు, ట్రాఫిక్ పరిస్థితి, ప్రజల రాకపోకలను పరిశీలించారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రాత్రివేళ భక్తులు, యువత అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. డీజేలు, అధిక శబ్దం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా ఖిల్లా రోడ్డులో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాన్ని గమనించిన సీపీ సాయి చైతన్య వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వాహనదారులను హుటాహుటిన ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సీపీ ఆదేశించారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీపీ స్పష్టం చేశారు.












