సిరికొండ, 2024-08-31
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం పెద్ద వాల్గొట్ గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం పెద్ద వాల్గొట్ గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చిందని నాయకులు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సరుకులు సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు మరింత వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో, నియోజకవర్గంలోని అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ రావు, ఉపసర్పంచ్ తలకట్ల రాము, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్, కిసాన్ కేత్ అధ్యక్షుడు గాదారి నర్సారెడ్డి, జీపీ ఓ నవీన్, రేషన్ డీలర్ రమశేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు లియాకత్ అలీ, జె. నర్సారెడ్డి, శేఖర్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.











