సిరికొండ, 4 September
మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రారంభమైన వేడుకల్లో భాగంగా సాయంత్రం శ్రీకృష్ణ విజయం పేరుతో భాగవత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాత్రంతా భక్తి భజన కీర్తనలు నిర్వహించారు.
చిన్న వాల్గొట్లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి పారవశ్యంలో శోభాయాత్ర.. ఉత్సాహంగా ఉట్టి కొట్టిన యువత, చిన్నారులు :(భారత్ స్పెక్ట్రామ్ ) మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రారంభమైన వేడుకల్లో భాగంగా సాయంత్రం ‘శ్రీకృష్ణ విజయం’ పేరుతో భాగవత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాత్రంతా భక్తి భజన కీర్తనలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం భజన కీర్తనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించి గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో గ్రామ ప్రజలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పాటలు, భజనలతో సందడి చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దడివే గణేష్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దడివే చిన్న గణేష్, మోహన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ప్రవీణ్, గంగాధర్, రాజేందర్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజయవంతంగా ముగిశాయి.












