సిరికొండ, 4 September
మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక భజనలు, పూజలు నిర్వహిస్తూ శ్రీకృష్ణుని జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది.
పెద్దవాల్గొట్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు భజనలతో మార్మోగిన గ్రామం.. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక :(భారత్ స్పెక్ట్రామ్ ) మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, విలేజ్ కమిటీ చైర్మన్ తలకట్ల సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక భజనలు, పూజలు నిర్వహిస్తూ శ్రీకృష్ణుని జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తలకట్ల సాగర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక భజనలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ సమీపంలోని వాగు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలకట్ల సాగర్ రెడ్డి, పోతుగంటి రాజేందర్, గంటాజి ప్రమోద్, ఉపసర్పంచ్ రాము, పంతులు శ్రీనివాస్, చింటూ, కే. శ్రావణ్, కే. శ్రీకాంత్, హోలీయ దాసరి భజన మండలి సభ్యులతో పాటు యువకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.












