పక్షాన (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 11
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు విద్యాశాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వసూలు చేస్తున్న ఫీజు వివరాలను నోటీసు బోర్డులు, వెబ్సైట్లలో ప్రదర్శించాలనే నిబంధనలను 12938 పాఠశాలలు పాటించడం లేదు. కేవలం 739 పాఠశాలల్లో మాత్రమే ఈ నిబంధనలు అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ un-aided పాఠశాలలు. ఫీజు వివరాలను నోటీసు బోర్డుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించని పాఠశాలలు 12938. కేవలము 739 పాఠశాలలో మాత్రమే అమలు. జీవో ఎంఎస్ నెంబర్ 1 రూల్ 11 ప్రకారం నోటీసులు జారీ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ un-aided పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వసూలు చేస్తున్న తరగతుల వారిగా ఫీజు వివరాలను నోటీస్ బోర్డులతోపాటు వెబ్సైట్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు Rc.no.846/ps-1/2025 Dy.7.8.2026 తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రూల్ 1993 ప్రకారం ప్రవేట్ యాజమాన్యాలు తమ ఫీజు నిర్మాణాన్ని అధికారిక వెబ్సైట్ school edn, telangana gov.in అప్లోడ్ చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ నేటికీ 12938 పాఠశాలలు నిబంధనలు పాటించడం లేదు. కావున తక్షణమే ఫీజు వివరాలను నోటీసు బోర్డులపై మరియు వెబ్సైట్లో ప్రదర్శించని పాఠశాలలను Goms.no.1రూల్ 11 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసి తక్షణమే చర్యలు గైకొనాలని పిఆర్టియు తెలంగాణ పక్షాన జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు












