సిరికొండ, 6 September
మండలం న్యావనంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గురువుల గొప్పతనాన్ని, విద్యార్థుల జీవితంలో వారి పాత్రను వివరించారు.
గురువే భవిష్యత్తుకు బాట చూపే మార్గదర్శి న్యావనంది ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ (భారత్ స్పెక్ట్రమ్): మండలం న్యావనంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు గురువు యొక్క గొప్పతనం, విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర, గురు-శిష్యుల మధ్య ఉన్న అనుబంధం గురించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. విద్యార్థులను ప్రేమ, ఆప్యాయతతో ప్రోత్సహిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసేలా విద్యాబోధన చేస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు నమస్కరించి, వారిని ఘనంగా సత్కరించారు. పిల్లల విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేష్, ఉపాధ్యాయులు అశ్విని, వీణారాణి, కృష్ణవేణి, దివ్య, రుచిత, మానస, పావని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.











