కామారెడ్డి, 28 July
గ,థ,,భగషూణగైగఏ,ళగగయఆళయ
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని రోడ్డు వంతెన ప్రమాదకరంగా మారిందని, వెంటనే కొత్త బ్రిడ్జిని నిర్మించాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు, ముద్రాజ్ కొరివి నరసింహులు, గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత వర్షాకాలంలో కూలిన ఈ వంతెన, రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, రాత్రి వేళల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు ఇప్పటికీ స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు ప్రతి విషయాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని, తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎన్నికలు వచ్చేంతవరకు వేచి చూడాలా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఒక్కటేనని, ప్రభుత్వాల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించాల్సి వస్తుందని అన్నారు.
బీబీపేట నాలుగు జిల్లాల కూడలి (కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్) అని, అందరూ ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్నారని, అలాంటి ముఖ్యమైన రోడ్డును పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.







