వేల్పూర్ (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 31
వేల్పూర్ మండలంలో రోడ్డు మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మోతే-వేల్పూర్ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల బైక్ స్కిడ్ అయి తండ్రి, కూతురు గాయపడటంతో, గ్రామ యువకులు స్వయంగా రంగంలోకి దిగి గుంతలను పూడ్చారు.
వేల్పూర్ మండలంలోని మోతే-వేల్పూర్ మధ్య రహదారిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై అనేక గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల కారణంగా ఈరోజు ఉదయం ఒక బైక్ అదుపుతప్పి స్కిడ్ అవ్వడంతో తండ్రి, కూతురు గాయపడ్డారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన మోతే గ్రామ యువకులు కొందరు, రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను తమ సొంత ఖర్చులతో సిమెంట్, కంకరతో పూడ్చారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించారని, అందుకే తామే ఈ పని చేయాల్సి వచ్చిందని ఆ యువకులు తెలిపారు. యువకుల ఈ పనికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి, ప్రమాదాలకు కారణమవుతున్న ఈ గుంతలను శాశ్వతంగా పూడ్చివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సుమన్, శ్రీ నాథ్, భరత్, రంజిత్ పాల్గొన్నారు.












