నిజామాబాద్, జూలై 28
గచయతీోీతోసతననఉసచగౌతనసటగటీోసచనహోదచనటఉసచోఉధయచ.గళఆయనఆధయోజఉసచీఆఓనతతసచ.
ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం కల్పించాలని, ప్రారంభోత్సవాల శిలాఫలకాలపై వారి పేర్లు చేర్చాలని, స్టాండింగ్ కమిటీలలో వైస్ చైర్మన్ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు వికార్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప సర్పంచులు, జిల్లా సమగ్ర భవన సముదాయంలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలలో ప్రజాస్వామ్యం, పారదర్శకత, సమిష్టి బాధ్యత అమలు కోసం పలు అధికారాలు కల్పించబడ్డాయన్నారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం సర్పంచ్ గైర్హాజరైనప్పుడు, పదవి ఖాళీ అయినప్పుడు లేదా విధులు నిర్వహించలేని పరిస్థితులలో ఉప సర్పంచ్‌కు సర్పంచ్ అధికారాలు వినియోగించుకునే హక్కు కల్పించబడిందని తెలిపారు. ఈ విధానం వలన గ్రామ పంచాయతీలో అవినీతి నియంత్రణ, బాధ్యతాయుత పాలన, ప్రజాధనం సరైన వినియోగం సాధ్యమవుతాయని అన్నారు.
ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కూడా ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులేనని, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు, పంచాయతీ పరిపాలనలో వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. అయినప్పటికీ వారు నిర్వహిస్తున్న సేవలకు తగిన గౌరవ వేతనం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉపసర్పంచ్‌లకు రూ. 5000, వార్డు సభ్యులకు రూ. 3000 గౌరవ వేతనంగా కల్పించాలని రాష్ట్ర ఫోరం తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
అదేవిధంగా, గ్రామ పంచాయతీ తీర్మానాల పత్రాలపై ఉపసర్పంచ్‌లకు కూడా సంతకం చేసే హక్కు కల్పించాలని, శిలాఫలకాలపై వారి పేర్లను కూడా చేర్చాలని కోరారు. మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచ్‌లను కూడా ఆహ్వానించాలని, గ్రామ పంచాయతీలోని వివిధ స్టాండింగ్ కమిటీలలో సర్పంచ్‌ను చైర్మన్‌గా గుర్తించినప్పుడు, ఉపసర్పంచ్‌ను వైస్ చైర్మన్‌గా గుర్తించాలన్నారు. దీనివల్ల గ్రామ పాలనలో సమిష్టి బాధ్యత, పారదర్శకత, ప్రజాస్వామ్య విధానం మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌లకు ఎంత బాధ్యత ఉందో ఉపసర్పంచ్‌లకు కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు. ఉపసర్పంచ్‌కు అధికారాలు, గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు మహేష్, జిల్లాలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.












