నిజామాబాద్: ఢిల్లీలో ఒక మహిళా జర్నలిస్ట్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్‌లోని నెహ్రూ పార్క్ వద్ద ముస్లిం జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్ట్‌పై ఢిల్లీ పోలీసులు అమానుషంగా వ్యవహరించడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే చర్య అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, నిరసన నినాదాలు చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని, పోలీసుల తీరుపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వక్తలు పిలుపునిచ్చారు పాప కాన్, ఖాలేద్ ఖాన్, అన్వర్ ఖాన్, మజీద్ తదితరులు రిపోర్టర్లు పాల్గొన్నారు
ఢిల్లీలో ఒక మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ
Share:

సారాంశం
నెహ్రూ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ, బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్
ముఖ్య విషయాలు
- నిజామాబాద్: ఢిల్లీలో ఒక మహిళా జర్నలిస్ట్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్‌లోని నెహ్రూ పార్క్ వద్ద ముస్లిం జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
- విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్ట్‌పై ఢిల్లీ పోలీసులు అమానుషంగా వ్యవహరించడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు.
- పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే చర్య అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కొవ్వొత్తులు వెలిగించి, నిరసన నినాదాలు చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Mohammad Abdul Muqeem
Reporter
Telangana
261ఆర్టికల్స్
52,274వ్యూస్










