కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ కూరపాటి రఘు (42) మంగళవారం ఉదయం మృతి చెందాడు.
బాన్సువాడ పట్టణంలోని సిద్ది గల్లీలో నివాసం ఉన్న రఘు, వాంతులు చేసుకుని గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందాడు.
రఘు గాందారి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధుల నిర్వహించిన అతడు, మంగళవారం ఉదయం విధి నిర్వహణ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ సంఘటనతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రఘుకు భార్య మరియు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాన్సువాడలోని నివాసంలో రఘు మృతదేహానికి సిఐ మరియు ఎస్ఐ సహా పోలీస్ సిబ్బంది నివాళులు అర్పించారు.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులకు కొంతమంది పోలీసులు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.






