Bhimgal, 28 July
భగంగంల సంతష్ననెేచేనణనబధచనజూనఅధగంగంలణచేశ.ొ27బధఈఅజేశ.అనగంగంల27జెటజూచేయేనూచేచ.
భీంగల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని 27 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయడంతో పాటు, అదనంగా మరో 27 మందికి జిల్లా కలెక్టర్ మంజూరు చేయగా, మంగళవారం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని లబ్ధిదారులను ఎంపీడీవో సంతోష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జనార్ధన్, ఆయా గ్రామాల సర్పంచులు, హౌసింగ్ ఏఈ తేజస్, ఏపీవో నర్సయ్య, ఏపీఎం ప్రమీల, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.











