Bhimgal, 28 July
భీమ్‌గల్‌లో జూనియర్ సివిల్ కోర్టు సాధనలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ మధుశేఖర్ అభినందనలు.సివిల్కోర్టుసాధనలోకృషిచేసినప్రతిఒక్కరికీడాక్టర్మధుశేఖర్అభినందనలు. సివిల్ కోర్టు ఏర్పాటు కావడం ప్రాంత అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఈ కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు అందుబాటులోకి రావడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని, భవిష్యత్ న్యాయవాదులు, న్యాయమూర్తుల ఎదుగుదలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
భీమ్‌గల్‌లో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు కావడం ప్రాంత అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఈ కోర్టు సాధన కోసం కృషి చేసిన గత, ప్రస్తుత వీడీసీ సభ్యులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని ఛానళ్లతో పాటు పత్రికా విలేకరులకు ఆయన ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
జూనియర్ సివిల్ కోర్టు అందుబాటులోకి రావడం వల్ల చిన్న చిన్న సివిల్ వివాదాలు, ప్రమాదాలకు సంబంధించిన కేసుల విషయంలో ప్రజలు ఇకపై ప్రతిసారి ఆర్మూర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, దీంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ ప్రాంత విద్యార్థులు న్యాయవాదులు, న్యాయమూర్తులుగా ఎదగడానికి ఈ కోర్టు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భీమ్‌గల్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా, గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు, యువత, నాయకులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.











