బాల్కొండ గ్రామపంచాయతీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రదర్శించిన అనర్హుల జాబితాలో పలువురు అర్హుల పేర్ల వద్ద ప్రజా పాలన దరఖాస్తు లిస్టులో పేరు లేదు అని రిమార్క్ మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ షాహీద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా పాలన దరఖాస్తులో రెండు పడక గదుల ఇళ్లకు ప్రత్యేక ఆప్షన్ లేనప్పుడు, ఆ కారణంతో అర్హులైన వారిని అనర్హులుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇది పేద కుటుంబాలకు అన్యాయం చేసే చర్య అని ఆయన అన్నారు. ఈ జాబితాను అధికారులు మరోసారి సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న పేద కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని షాహీద్ కోరారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రెండు పడక గదుల ఇళ్ల జాబితాపై అభ్యంతరాలు: అర్హుల పేర్ల తొలగింపుపై మాజీ కోఆప్షన్ సభ్యుడి ఆక్షేపణ
Share:

సారాంశం
ప్రజా పాలన దరఖాస్తులో ప్రత్యేక ఆప్షన్ లేనప్పుడు అనర్హులుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించిన ఎంఏ షాహీద్
ముఖ్య విషయాలు
- బాల్కొండ గ్రామపంచాయతీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- ప్రజా పాలన దరఖాస్తులో రెండు పడక గదుల ఇళ్లకు ప్రత్యేక ఆప్షన్ లేనప్పుడు, ఆ కారణంతో అర్హులైన వారిని అనర్హులుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
- ఇటీవల గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రదర్శించిన అనర్హుల జాబితాలో పలువురు అర్హుల పేర్ల వద్ద ప్రజా పాలన దరఖాస్తు లిస్టులో పేరు లేదు అని రిమార్క్ మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ షాహీద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- ఇది పేద కుటుంబాలకు అన్యాయం చేసే చర్య అని ఆయన అన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Mohammad Abdul Muqeem
Reporter
Telangana
264ఆర్టికల్స్
56,129వ్యూస్










