నిజామాబాద్, జూలై 06
నిజామాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 131 ఫిర్యాదులు అందాయి. ఈ అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 131 ఫిర్యాదులు అందాయి.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ సాయన్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.









