ముషీరాబాద్, జూలై 4
తక్షణ కండరాల పెరుగుదల కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ సప్లిమెంట్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (సికింద్రాబాద్ జోన్), ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి, రూ.6.5 లక్షల విలువైన ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తక్షణ కండరాల పెరుగుదల కోసం వినియోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ సప్లిమెంట్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (సికింద్రాబాద్ జోన్), ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.6.5 లక్షల విలువైన భారీ మొత్తంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ ఇంజెక్షన్లు, బాడీ సప్లిమెంట్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితులు బట్టే శివ, మహమ్మద్ ఫుర్కానుద్దీన్ ఫైసల్ ఆన్లైన్ వేదికల ద్వారా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి, అధిక ధరలకు జిమ్‌లకు సంబంధించిన వ్యక్తులు, ఉప-విక్రేతలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో నలుగురు ఉప-విక్రేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి టెర్మిన్, మెఫెంటర్మైన్ సల్ఫేట్, టెస్టోస్టెరాన్, సోమాట్రోపిన్, డ్రోస్టానోలోన్ తదితర ఇంజెక్షన్లతో పాటు ఇతర బాడీ సప్లిమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఆపరేషన్‌ను గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపిఎస్, డిసిపి టాస్క్ ఫోర్స్, జె రాజశేఖర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, జి రాజగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ముషీరాబాద్ పిఎస్, బి మహేష్, ఎస్ఐ ఆఫ్ పోలీస్, పి. జ్ఞానదీప్, ఎస్ఐ ఆఫ్ పోలీస్, పి మణికాంత రాజు, ఎస్ఐ ఆఫ్ పోలీస్ సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, కెవి లక్ష్మీ నారాయణ, ఎస్ఐ ఆఫ్ పోలీస్, జి దుర్గా చౌదరి, ముషీరాబాద్ పిఎస్, సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, ముషీరాబాద్ పిఎస్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిమ్ యజమానులు, ఫిట్నెస్ ట్రైనర్లు, యువత వైద్యుల సూచన లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, కండరాల పెరుగుదల మందులు వినియోగించవద్దని పోలీసులు హెచ్చరించారు. నగరంలోని జిమ్‌లపై నిరంతర పర్యవేక్షణతో పాటు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.











