నిజామాబాద్, జూలై 3
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
కార్యక్రమ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సమావేశమై వేదిక, భద్రత, తాగునీరు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల కిషన్, నాయకులు ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, సంజయ్ తదితరులు ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.











