బాల్కొండ, 6 September
మండలంలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. మాయమాటలు చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళతో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో వారిని పట్టుకుని, బాలుడిని సురక్షితంగా రక్షించారు.
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. కిలాడి లేడి ఆట కట్టించిన పోలీసులు రెండు రోజులుగా జిల్లాలో సంచలనంగా మారిని బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో శనివారం చికిత్స నిమిత్తం మాతాశిశు ఆస్పత్రికి వచ్చారు. అయితే వారిద్దరు పిల్లలు బయట ఆడుకుంటుండగా.. అందులో చిన్న బాలుడిని ఓ మహిళ మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. ఇదంతా సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. బాలుడు కనిపించట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయ్యారు. డయల్ 112ను కాల్చేశారు. పోలీసులు మాతా శిశు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ పుటేజీలను వెలికితీసి చూడగా మహిళ బాలుడిని తీసుకెళ్తున్నట్లుగా స్పష్టంగా కనిపించింది. అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. సీపీ సాయిచైతన్య 8 బృందాలనే ఏర్పాటు చేశారు. వారంతా సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఆమెతో పాటు మరో నిందితుడిని ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్‌లో వారిని పట్టుకొని, బాలుడిని రక్షించారు.











