నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల స్మార్ట్ సిటీ వెంచర్లో ఓ యువతి తన కాబోయే భర్తతో మాట్లాడుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. వారిని రూ. 1.50 లక్షలు డిమాండ్ చేస్తూ, రూ. 4 వేలు, స్కూటీని బలవంతంగా తీసుకొని వెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
స్మార్ట్ సిటీ వెంచర్లో యువతి, తనకు కాబోయే భర్తతో అసభ్యంగా ప్రవర్తించి, డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదుతో ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల స్మార్ట్ సిటీ వెంచర్లో ఓ మహిళ తన కాబోయే భర్తతో మాట్లాడుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి, బాధిత మహిళ చేయి పట్టుకొని లాగుతూ, ఆమె చున్నీని లాగి అసభ్యంగా ప్రవర్తించారు. సదరు వ్యక్తులు వారిని రూ. 1,50,000/- డిమాండ్ చేస్తూ, చేతులతో కొట్టి బెదిరించి, వారి వద్ద నుండి బలవంతంగా రూ. 4,000/- వసూలు చేశారు. అంతేకాకుండా, వారి వద్ద ఉన్న టీజీ 16 ఈ 6314 నంబర్ గల యాక్టివా స్కూటీని కూడా తీసుకొని వెళ్లినట్లు బాధితులు ఐదవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై బాధితులు నిందితులైన గోడలే గణేష్, ప్రమోద్, పరమేశ్వర్ అనే ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ డి. శ్రీనివాస్ కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు వెంటనే గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.












