నిజామాబాద్ నగరంలో మహిళపై అసభ్యంగా ప్రవర్తించి, ఆమె భర్తను కొట్టి నగదు, స్కూటీని లాక్కెళ్లిన కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
న్యాల్కల్ రోడ్డులోని స్మార్ట్ సిటీ వెంచర్లో ఒక మహిళ తన కాబోయే భర్తతో ఉన్న సమయంలో, ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి అక్కడికి వచ్చి మహిళను వేధించారు. ఆమె చేయి, చున్నీ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా, వారి వద్ద ఉన్న 4,000 నగదుతో పాటు స్కూటీని బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారు.
ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ టౌన్-5లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సబ్ఇన్స్పెక్టర్ డి. సునీల్, నిందితులైన గోడనే గణేష్, ప్రమోద్, పరమేశ్వర్లలో ప్రధాన నిందితుడైన గోడనే గణేష్‌ను అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన గోడనే గణేష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతా నిందితులైన ప్రమోద్, పరమేశ్వర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.












