జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఏటీఎంలను చోరీ చేయడానికి విఫలయత్నం చేశారు. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలోకి ప్రవేశించి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఏటీఎం మిషన్‌ను తెరవడానికి ప్రయత్నించారు.
జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లోని ఏటీఎంలలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు దుండగులు ముసుగులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, రాడ్ల సాయంతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ తెరవకపోవడంతో దుండగులు నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ విషయం తెలిసిన బ్యాంక్ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, దుండగుల కోసం గాలింపు చేపట్టారు. దొంగలు ఏటీఎం మిషన్‌ను తెరవడంలో విఫలమవ్వడంతో, నగదు నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.












