బిచ్కుందలో తండ్రి తన కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతుడు గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో తల్లిపై దాడి చేయడంతో అడ్డుకున్న తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ర్లోళ్ల సురేశ్ (25) మద్యం మత్తులో ఇంటికి వచ్చి తల్లిపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకున్న తండ్రి శివరాం, టవల్‌తో కుమారుడి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం, కుమారుడు గుండెపోటుతో మరణించినట్లు శివరాం గ్రామస్థులకు చెప్పాడు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని సీఐ రవి కుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












