నిజామాబాద్, 2024-06-27
ఫజమెటనెటనేడచేనడమడచేతూ,ఈనె30తేనషటతగజతనచచ.నజమోనహచనేమేోజఅధషడనతేతఈనెడచ.
కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఈనెల 30వ తేదీన కళాశాలల బంద్ ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునిచ్చారని తెలిపారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఉన్న వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా కళాశాల యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, జనార్దన్, శ్రీను, అరవింద్, కిరణ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.












