నిజామాబాద్, జూన్ 27
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కఠిన తనిఖీలు చేపట్టినా, మందుబాబుల తీరు మారడం లేదు. గత రెండు వారాల్లో 426 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో కొందరికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గడం లేదు. వారం రోజుల్లోనే ఏకంగా 426 కేసులు నమోదయ్యాయంటే, ఎంతమంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారో స్పష్టమవుతోంది.
గత రెండు వారాలుగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ట్రాఫిక్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 426 మంది పట్టుబడగా, వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో ప్రవేశపెట్టారు. వీరిలో 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి రూ.41,60,000 జరిమానా విధించినట్లు సీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.










