నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అనుమతులు, కనీస భవనం కూడా లేకుండానే 2027-2028 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాల అడ్మిషన్లు చేపడుతున్న విద్యా సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ () జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారికి () వినతి పత్రం అందజేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ, అనుమతులు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా 6 నుంచి 7 నెలల సమయం ఉండగానే, ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే తదుపరి సంవత్సరానికి జూనియర్ కళాశాల అడ్మిషన్లు చేయడం దారుణమని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపించారు. విద్యాశాఖ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత విచ్చలవిడిగా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తక్షణమే ఆ యాజమాన్యాన్ని సంప్రదించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కళాశాల భవనం, ఇంటర్మీడియట్ నుంచి గుర్తింపు పొందిన తర్వాతే అడ్మిషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌ను కలిసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు.












