నుండి ఆర్మూర్, మాక్లూర్ రూట్లలో ప్రయాణించే విద్యార్థుల బస్సు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) జిల్లా ఇంచార్జీ అఖిల్ ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు. మాణిక్‌భండార్ వద్ద బస్సులు ఆగకపోవడం, అదనపు బస్సులు లేకపోవడం వంటి సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నుండి ఆర్మూర్ రూట్లో వెళ్లే , , వంటి ప్రముఖ కళాశాలల విద్యార్థులు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే మాణిక్‌భండార్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడం వల్ల విద్యార్థులు గంటల తరబడి బస్టాండ్‌లోనే నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అధికారులు బస్సులను ఇక్కడ ఖచ్చితంగా ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా బోర్గాం (కె), మాణిక్‌భండార్, అమ్రాద్, ఒడ్డెడ్పల్లి ప్రాంతాల నుండి మాక్లూర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సులు లేవని అఖిల్ పేర్కొన్నారు.
బస్సుల కొరత కారణంగా ప్రత్యామ్నాయం లేక, 18 సంవత్సరాల వయస్సు కూడా నిండని మైనర్ విద్యార్థులు లైసెన్స్ లేకుండానే బైక్‌లపై కళాశాలలకు వెళ్తున్నారని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు లేక విద్యార్థులు బస్టాపుల్లోనే ఉండిపోవాల్సి రావడం వారి చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును, ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని మాణిక్‌భండార్ వద్ద బస్సులు ఆపాలని, అలాగే విద్యార్థుల రద్దీకి అనుగుణంగా తక్షణమే అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్, రీజినల్ మేనేజర్లను డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తక్షణమే న్యాయం చేయకపోతే విద్యార్థులను ఏకం చేసి బస్టాండ్‌ను ముట్టడిస్తామని అఖిల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు సుజిత్, హేమంత్, నైతిక్ తదితరులు పాల్గొన్నారు.












