శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ ఏ. సుమలత ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాల్లో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా నేషనల్ బిజినెస్ ఐకానిక్ అవార్డ్స్2026 అందుకున్నారు. హైదరాబాద్లోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కావలి రమేష్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై సుమలతకు అవార్డును అందజేశారు.
విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తూనే, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్న సుమలత ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పేదలు, నిరుపేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తున్నారు. సేవే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మందికి సహాయం అందించారు.
ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 1,000 పురాతన హనుమాన్ ఆలయాలకు రంగులు వేయించి, వాటి పరిరక్షణకు కృషి చేశారు. భక్తి భావాన్ని పెంపొందించడంతోపాటు, ధార్మిక జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో భారీ స్థాయిలో ఆధ్యాత్మిక గ్రంథాలను పంపిణీ చేశారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల హనుమాన్ చాలీసా పుస్తకాలు, 11 లక్షల భగవద్గీత పుస్తకాలు, 5 లక్షల రామాయణ పుస్తకాలు, 4 లక్షల శివపురాణ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న ఏ. సుమలత సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి 7చేస్తున్నారు. ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డుతో సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యతో యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తూ, సేవతో సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఏ. సుమలత తన సేవా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.












