నిజామాబాద్, 15 September
కుర్థుల్ పేట్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ గాండ్ల నవనీత సతీష్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆలయంలో పాత ఫ్లోరింగ్ దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, తన సొంత నిధులతో నూతన టైల్స్ వేయించే పనులను చేపట్టారు.

అదేవిధంగా, దేవతామూర్తుల కోసం నూతన గద్దెల నిర్మాణ పనులను కూడా చేపట్టారు. ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
గ్రామ అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కూడా తనవంతు సహకారం అందిస్తానని సర్పంచ్ తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులకు సొంత నిధులు వెచ్చించి చొరవ చూపిన సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.