కామారెడ్డి జిల్లా మండలం హన్మాజీపేటలో ఈ నెల 23న జరిగిన కాశీరాం హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తను హత్య చేసి చెరువులో పడవేసిన ఘటనలో మృతుడి భార్య సవితతో పాటు సంతోష్, రాములను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సవితకు వరుసకు మరిది అయిన సంతోష్‌తో వివాహేతర సంబంధం ఉంది. భర్త కాశీరాంను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో సంతోష్, రాముతో కలిసి హత్యకు పథకం రచించాడు. మరోవైపు కాశీరాంకు గంగమని అనే మహిళతో సంబంధం ఉండగా, రాముకు కూడా ఆమెతో సంబంధం ఉంది. గంగమని నుంచి కాశీరాంను దూరం చేయాలనే ఉద్దేశంతో రాము సైతం హత్యలో భాగస్వామిగా మారినట్లు పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారం ఈ నెల 23న కాశీరాంకు మద్యం తాగించి, తాడుతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. దర్యాప్తులో నిందితుల పాత్రను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ వివరాలను డీఎస్పీ విట్టల్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.












