నిజామాబాద్, 11 September
తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలని, మిల్లింగ్ ఛార్జీని క్వింటాలుకు రూ.150కు పెంచాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ శుక్రవారం ధర్నాచౌక్లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
తనిఖీల పేరుతో వేధింపులు వద్దు! మిల్లింగ్ ఛార్జీ రూ.150కు పెంచాలి: రైస్ : తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ధర్నాచౌక్లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. మిల్లింగ్ ఛార్జీని క్వింటాలుకు రూ.150కు పెంచాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ధాన్యం కేటాయించిన మూడు నెలల్లోపు బియ్యాన్ని తీసుకునేలా చర్యలు చేపట్టాలని, బాయిల్డ్ రైస్ రేషియో తేలకముందే కొత్త ధాన్యం కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. సార్టెక్స్ రిజెక్షన్లు, నూకల తరుగు నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఇరుపక్షాలకు అనుకూలంగా మిల్లింగ్ ఒప్పందం రూపొందించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే మిల్లుల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని హెచ్చరించారు.












