ముచ్కూర్ (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 26
ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా బుక్ చేసుకున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా సంచులను పంపిణీ చేశారు.
ముచ్కూర్: ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా బుక్ చేసుకున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా సంచులను పంపిణీ చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యం
ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉన్న మేరకు సొసైటీ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యూరియా అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రకటనలు, ప్రచార మాధ్యమాల ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారాలపై స్పందన
సొసైటీ, పాలకవర్గం, చైర్మన్‌ను కొందరు గిట్టని వ్యక్తులు బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని చైర్మన్ అన్నారు. యూరియా పంపిణీ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం పనిచేస్తోందని, ఎలాంటి అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన రైతులను కోరారు.












