భీమ్గల్ పురపాలక సంఘం పరిధిలో, చేయూత పథకం కింద పింఛన్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ బుధవారం పరిశీలించారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భీమ్గల్ పురపాలక సంఘం పరిధిలో, చేయూత పథకం కింద పింఛన్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ బుధవారం పరిశీలించారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా వివరాల పరిశీలన చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.












