సిరికొండ, 5 September
నిజామాబాద్ జిల్లా, మండలం, తుంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు బాదావత్ అఖిల, బాదావత్ పల్లవి ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా () హాకీ అకాడమీకి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎంపిక ప్రక్రియలో వీరు ప్రతిభ కనబరిచారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాకీ అకాడమీకి తుంపల్లి పాఠశాల విద్యార్థినిల ఎంపిక (భారత్ స్పెక్ట్రామ్ ) : నిజామాబాద్ జిల్లా, మండలం, తుంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బాదావత్ అఖిల, బాదావత్ పల్లవి ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాకీ అకాడమీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు (PD) నాగేష్ తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గల ‘సాయ్’ (SAI) సెంటర్లో వీరికి నిర్వహించిన హాకీ ప్రత్యేక ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కనబరిచారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన హాకీ ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి క్రీడా అకాడమీకి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి క్రీడా అకాడమీకి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి అకాడమీకి ఎంపికైన అఖిల, పల్లవిలను మండల విద్యాధికారి (MEO) రాములు సార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేష్ చేస్తున్న కృషిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, సరైన ప్రోత్సాహం, శిక్షణ అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. అలాగే గ్రామ సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ లత, నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాల్ గంగారెడ్డి, సెక్రెటరీ ఎస్. రమణ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.









