కామారెడ్డి, 22 September
జిల్లా మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 25 పతకాలు సాధించి, కళాశాల గౌరవాన్ని పెంచారు. వీరిలో ఏడుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జిల్లా మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (మర్కల్) విద్యార్థినులు, లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని, పదకొండు స్వర్ణ పతకాలు, పది రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి తమ సత్తా చాటారు. వివరాల్లోకి వెళ్తే, సి.హెచ్. వైష్ణవి అండర్-20 డిస్కస్ త్రోలో స్వర్ణం, ఎస్. దివ్య 800 మీటర్ల పరుగులో స్వర్ణం, ఎం. మహేశ్వరి అండర్-18 జావెలిన్ త్రోలో స్వర్ణం, ఎం. వెన్నెల 400 మీటర్ల పరుగులో స్వర్ణం, బి. నవ్యశ్రీ అండర్-20 జావెలిన్ త్రోలో స్వర్ణం, బి. ప్రహర్ష అండర్-20 400 మీటర్ల పరుగులో స్వర్ణం, జె. కీర్తన డిస్కస్ త్రోలో స్వర్ణం, కే. దివ్య అండర్-20 100 మీటర్ల పరుగులో స్వర్ణం, జి. అర్చన అండర్-20 800 మీటర్ల పరుగులో స్వర్ణం, పి. ఛాయా 100 మీటర్ల పరుగులో స్వర్ణం, ఓ. శిరీష అండర్-18 షాట్ పుట్లో స్వర్ణం సాధించారు. అలాగే, ఎం. సవిత అండర్-20 డిస్కస్ త్రోలో రజతం, ఆర్. ప్రీతి అండర్-20 100 మీటర్ల పరుగులో రజతం, ఈ. రాజశ్రీ అండర్-20 800 మీటర్ల పరుగులో రజతం, పి. రుతిక 400 మీటర్ల పరుగులో రజతం, బి. అర్చన అండర్-18 100 మీటర్ల పరుగులో రజతం, ఆర్. రాసాజ్ఞ అండర్-20 షాట్ పుట్లో రజతం, సి.హెచ్. శిరీష అండర్-20 400 మీటర్ల పరుగులో రజతం, మనుష బాయి అండర్-20 400 మీటర్ల పరుగులో రజతం, ఎం. అమృత జావెలిన్ త్రోలో రజతం, కే. స్వప్న అండర్-20 జావెలిన్ త్రోలో రజతం గెలుచుకున్నారు. టి. భవాని అండర్-20 800 మీటర్ల పరుగులో కాంస్యం, ఎన్. స్పందన అండర్-20 100 మీటర్ల పరుగులో కాంస్యం, ఎం. గాయత్రి షాట్ పుట్లో కాంస్యం, జి. లావణ్య డిస్కస్ త్రోలో కాంస్యం సాధించారు.
వీరిలో ఎం. అమృత, వైష్ణవి, బి. నవ్యశ్రీ, ఎం. మహేశ్వరి, బి. ప్రహర్ష, జి. అర్చన, ఎం. వెన్నెలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, పోటీలను నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ లు విద్యార్థులను అభినందించారు. అలాగే, చక్కని ప్రతిభ కనబరిచినందుకు గాను విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, అధ్యాపక బృందం అభినందించారు.












