మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన రూ.3,49,500 విలువైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి గ్రామస్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్, ఉపసర్పంచ్ తలకట్ల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
అనారోగ్యం, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. తమకు సహాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జె సురేందర్ రెడ్డి, మండల కిసాన్ అధ్యక్షుడు గాదరి నర్సారెడ్డి, జాగిరపు నర్సారెడ్డి, ఓబీసీ మండల అధ్యక్షుడు నర్సింగ్, మైనార్టీ అధ్యక్షుడు లియాకత్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడియాల శేఖర్ రెడ్డి, నాగేల్లి శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యం రెడ్డి, మజీద్ మునీర్, గంటాజి రవి, లింబన్న, మాజీ ఎంపీ టీసీ భూమన్న, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










