ఆధ్వర్యం (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 02
సిరికొండ మండలం పెద్ద వాల్గొట్ గ్రామానికి చెందిన తలకట్ల పెద్ద గంగారెడ్డిని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా తలకట్ల పెద్ద గంగారెడ్డి సిరికొండ, సెప్టెంబర్ 2: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా సిరికొండ మండలం పెద్ద వాల్గొట్ గ్రామానికి చెందిన తలకట్ల పెద్ద గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు వెలుమా గంగారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కిసాన్ మోర్చా బలోపేతానికి కృషి చేస్తూ రైతుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి తలకట్ల పెద్ద గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చౌటుపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి అరికెల సాయి రెడ్డితో పాటు వివిధ మండలాల కిసాన్ మోర్చా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.









