సామాన్యుల విజయగాథలు, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేసే జాతీయ వేదికగా మన్ కీ బాత్ నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ 139వ ఎపిసోడ్‌ను ఆయన స్థానిక నాయకులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ప్రధానమంత్రికి, ప్రజలకు మధ్య ఆత్మీయ వారధిగా నిలిచిందని ఆయన అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులను, సమాజ సేవకులను కోట్లాది మందికి పరిచయం చేయడం దీని ప్రత్యేకత అని పేర్కొన్నారు.
తాజా ఎపిసోడ్లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న నవ్-త్రింజన్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడాన్ని ఆయన ప్రస్తావించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ, చేనేత నైపుణ్యాల పరిరక్షణ, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో హేవల్ నది పునరుజ్జీవనానికి స్థానికులు, అధికారులు కలిసి చేపడుతున్న వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్య ప్రాధాన్యాన్ని చాటుతున్నాయని ఆయన అన్నారు.
దీపావళి సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన కోరారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారులకు, కళాకారులకు అండగా నిలవవచ్చని ఆయన అన్నారు.
మన్ కీ బాత్ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదని, దేశంలోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే గొప్ప వేదిక అని ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.












