హైదరాబాద్, 2026-06-05
ఆధారాలు లేని తప్పుడు వార్తల వల్ల ఉపాధ్యాయులందరి మనోభావాలను దెబ్బతీయవద్దని, పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రముఖ దినపత్రికలో టీచర్లపై నిఘా పేరుతో వచ్చిన కథనం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని ఆయన తెలిపారు.
ఆధారాలు లేని తప్పుడు వార్తల వల్ల ఉపాధ్యాయులందరి మనోభావాలను దెబ్బతీయవద్దని, పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించని ఉపాధ్యాయులపై నిరభ్యంతరంగా పర్యవేక్షణ, క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని, అయితే ప్రముఖ దినపత్రికలో టీచర్లపై నిఘా పేరుతో వచ్చిన కథనం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని తెలిపారు.
నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, వారిని సమాజంలో బదనాం చేసేలా వచ్చిన ఈ వార్తా కథనాన్ని పిఆర్టియు తెలంగాణ పక్షాన జిల్లా గౌరవ అధ్యక్షులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే టీచర్లపై నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే, ఆ విషయాన్ని బహిరంగంగా సీఎం ప్రకటించాలని కోరారు.
ఒకవేళ అలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే, పత్రికలో వచ్చిన ఈ తప్పుడు వార్తలను ప్రభుత్వం తక్షణమే ఖండించాలని పిఆర్టియు తెలంగాణ పక్షాన జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఈ వార్త వల్ల నిజాయితీగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్రంగా నొచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.











