భీమ్‌గల్, 28 July
భీమ్గల్లోనిచేంగల్రైతువేదికలోవ్యవసాయశాఖఆధ్వర్యంలో"రైతునేస్తం"కార్యక్రమం100వఎపిసోడ్విజయవంతంగాజరిగింది.ఈసందర్భంగావ్యవసాయసాంకేతికత,నాణ్యమైనవిత్తనాలవినియోగం,పంటలయాజమాన్యంపైఅవగాహనకల్పించారు.నాణ్యమైనవిత్తనాలపైఅవగాహనతోపాటునుకూడానిర్వహించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "రైతు నేస్తం" కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా చేంగల్ రైతు వేదికలో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌ను రైతులు వీక్షించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పిస్తూ సీడ్ మేళాను కూడా నిర్వహించారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పంటల ఎంపిక, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలు, విత్తన శుద్ధి, సమగ్ర పురుగు-తెగుళ్ల నివారణ, ఎరువుల సమతుల్య వినియోగం వంటి అంశాలపై రైతులకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల గురించి కూడా తెలియజేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని, నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలనే వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏ బద్దం లావణ్య, ఏఈవోలు డి. స్నేహ, ఎం. దివ్య, హెచ్ఈఓ విద్యాసాగర్‌తో పాటు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు వ్యవసాయ నిపుణులను పంటల సాగు, విత్తనాల ఎంపిక, తెగుళ్ల నివారణకు సంబంధించిన సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు.












