పోతునూరు (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 11
సిరికొండ మండలం పోతునూరు గ్రామంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ భూత్ అధ్యక్షుడు అట్టి మల్ల రాజు అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చౌట్పల్లి ప్రభాకర్, మండల నాయకులు తలకట్ల పెద్ద గంగారెడ్డి, తలకట్ల సాగర్ రెడ్డితో పాటు పోతునూరు బీజేపీ గ్రామ శాఖ సభ్యులు తిరుపతి చారి, ఎం. కిషన్, కె. నిఖిల్, ఏ. రవి, ఏ. రాజేందర్, జి. సూర్యకాంత్, జి. గణేష్, ఎం. చింటూ, గంగాధర్, బి. నాగేష్, బి. దిలీప్, బి. ప్రణీత్, కె. నవీన్, ఏ. భూమయ్య, బి. వినయ్, ఏ. భోజన్న తదితరులు పాల్గొన్నారు.