Bhimgal, 11 September
మండలంలోని పిప్రి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో దేవాదాయ కమిటీ, గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా తాతయ్యల ఆయిల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎడ్లపుల అమావాస్య అనంతరం వచ్చే శుక్రవారం ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
పిప్రిలో ఘనంగా తాతయ్యల ఆయిల పండుగ. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక ... మండలంలోని పిప్రి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో దేవాదాయ కమిటీ, గ్రామ ప్రజలు కలిసి సంప్రదాయబద్ధంగా తాతయ్యల ఆయిల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎడ్లపుల అమావాస్య అనంతరం వచ్చే శుక్రవారం ఈ పండుగను నిర్వహించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. పెద్దల ఆశీర్వాదాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ తాతయ్యల విగ్రహాలను ప్రత్యేకంగా ముస్తాబు చేసి, కొత్త వస్త్రాలు ధరింపజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో మేకలు, గొర్రెలను బలి ఇచ్చి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. తాతయ్యల ఆశీస్సులతో పంట పొలాలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పిల్లాపాపలు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరికీ మేలు జరగాలని, కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పండుగను గ్రామంలో పెద్దల పండుగగా భావిస్తూ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. పండుగలో వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












