కార్యక్రమాల్లో (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 03
నిజామాబాద్ రూరల్ ఇంచార్జి, యువ నాయకులు బాజిరెడ్డి జగన్ గురువారం పెద్ద వాల్గొట్, పోతునూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కష్టకాలంలో అండగా.. మృతుల కుటుంబాలకు బాజిరెడ్డి జగన్ పరామర్శ : కష్టకాలంలో ఉన్న కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలిచారు నిజామాబాద్ రూరల్ ఇంచార్జి, యువ నాయకులు బాజిరెడ్డి జగన్. గురువారం పెద్ద వాల్గొట్, పోతునూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ద వాల్గొట్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు డా. నయీమ్ అన్న గారి తల్లి, షేక్ సుభాన్ గారి నానమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న బాజిరెడ్డి జగన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా పోతునూర్ సర్పంచ్ మహిపాల్ యాదవ్ గారి తండ్రి సునుగురు నర్సయ్య బుధవారం మధ్యాహ్నం స్వర్గస్తులయ్యారు. గురువారం నిర్వహించిన అంత్యక్రియల్లో బాజిరెడ్డి జగన్ పాల్గొని పాడె మోశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ.. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధను పంచుకోవడం, వారికి ధైర్యం చెప్పడం తమ బాధ్యత అన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలుస్తామని తెలిపారు. ఈ మండల అధ్యక్షులు నరవోయిన శ్రీనివాస్, రావుట్ల సర్పంచ్ రాజ్‌కుమార్, సిరికొండ సర్పంచ్ సాయిచరణ్, భూషణ్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.












