నిజామాబాద్, 2026-08-21
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సందర్శించారు. అంకాపూర్ లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూముల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సందర్శించారు. అంకాపూర్ లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూముల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పరిశీలించారు.
పనుల వేగవంతం, నాణ్యతపై ఆదేశాలు
ఆర్మూర్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. పనులను వేగవంతం చేస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పరిశీలించి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
మిగిలిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మిగిలిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిధుల హామీ
ఆలూరు ఎమ్మార్వో కార్యాలయం పరిధిలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ నిధుల మంజూరుకు అనుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారు.










