హాసకొత్తూరు (భారత్ స్పెక్ట్రమ్) ఆగస్టు 16
మండల పరిధిలోని హాసకొత్తూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎగురవేసిన జాతీయ జెండాను నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం మధ్యాహ్నం వరకు దింపకపోవడం స్థానికంగా విమర్శలకు దారితీసింది.
మండల పరిధిలోని హాసకొత్తూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. నిబంధనల ప్రకారం అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు జెండాను గౌరవప్రదంగా అవనతం (దింపడం) చేయాల్సి ఉంది.
నిర్లక్ష్యంపై విమర్శలు
అయితే ఆదివారం మధ్యాహ్నం గడుస్తున్నా పాఠశాల సిబ్బంది జెండాను దింపకుండా అలాగే ఉంచడంతో స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తిని, జాతీయ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలకు డిమాండ్
తరగతి గదుల్లో విద్యార్థులకు వీరు నేర్పే క్రమశిక్షణ ఇదేనా అని మండిపడుతున్నారు. జాతీయ జెండా పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.











