Bhimgal, 2026-06-05
ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలో వినూత్న నిరసన చేపట్టారు. లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న హామీలను సూచించే బాకీ కార్డులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పింది. అయితే, వెయ్యి రోజులు గడిచినా ఆరు గ్యారంటీలు, 420 హామీలలో అనేకంటిని నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఎంత బాకీ ఉందో తెలియజేస్తూ, వాటిని ఇకనైనా నెరవేర్చాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న హామీలు, ప్రయోజనాలను సూచించే బాకీ కార్డులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాలని, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని ఆ బుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల పూజ కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు వంటి వివిధ వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల ముందుంచారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









